Magazines

ఆదర్శ మహిళా కవయిత్రి మొల్లమాంబ

11 నిమిషాల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానందద

- మొల్ల విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన

నవతెలంగాణ-సత్తుపల్లి 

మహిళలపై ఆంక్షలు ఉన్న కాలంలోనే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో మొట్టమొదటి రామాయణాన్ని రచించి దేశానికి ఆదర్శంగా నిలిచిన ధన్యజీవి కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ దంపతులు కొనియాడారు. ఆదివారం సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా శాలివాహన కుమ్మర సంఘం మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


Mollamambaఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దంపతులు మాట్లాడారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ఆరు కాండలుగా విభజించి సరళమైన తెలుగులో అందించిన మొల్లమాంబ విగ్రహాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని శాలివాహన కుమ్మర సోదరులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి రావాల్సిన వాటాను తప్పకుండా అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం భూమి పూజ నిర్వహించి మొల్లమాంబకు ఘనంగా నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కుమ్మరి సంఘం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు కుదురుపాక నరసయ్య, గంగాధర వీరయ్య, జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, విగ్రహ కమిటీ కన్వీనర్, దాత దండు రామారావు, విరివాడ నాగభూషణం,  మల్లికంటి రాము, మండల కన్వీనర్ గుడిమెట్ల రామారావు, పట్టణ నాయకులు ఎదులాపురం వెంకటేశ్వరరావు, యూత్ కన్వీనర్ దండు వాసుదేవరావుతో పాటు నాయకులతో పాటు 200 మందికి పైగా శాలివాహన కుమ్మర కులస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్