- హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు హాజరు
- వివిధ రంగాల ప్రముఖులతో అభిప్రాయాల మార్పిడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్‌లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులతో కలిసి ఆయన భాగస్వామ్యమయ్యారు.సమ్మిట్‌లో నిర్వహిస్తున్న వివిధ సమావేశాలు, చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు కీలక అంశాలపై జరుగుతున్న అభిప్రాయాల మార్పిడిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. వివిధ ప్రాంతాలు, రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన భారత్ సమ్మిట్‌లో ఆయన పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రస్థాయి చర్చా వేదికలో భాగస్వామ్యమై పలువురితో ఆయన ముచ్చటించారు.







కామెంట్‌లు (0)