నవతెలంగాణ - నాగర్ కర్నూల్
తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ జిల్లా లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ రాణా మల్లేష్ వెల్లడించారు. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన నలుగురు విద్యార్థులు. అండర్ -12 విభాగంలో 150 మీటర్స్ లో రాధిక ప్రతిభ చాటగా, 150 మీటర్స్ లో 'దర్శి' రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
అండర్–16 విభాగంలో 1000 మీటర్ల పరుగుకు గణేష్ ఎంపిక కాగా, 400 మీటర్ల పరుగుకు జ్ఞానేశ్వర్ ఎంపికయ్యారు. అండర్–20 విభాగంలో 400 మీటర్ల పరుగుకు అజయ్, 80 మీటర్ల పరుగుకు నవీన్ ఎంపికయ్యారు. జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను నాగర్‌కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి శనివారం ఘనంగా సన్మానించారు. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదలతో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించవచ్చని ఎస్సై వెంకట్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాగర్‌కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్సై ఆకాంక్షించారు. విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని అథ్లెటిక్స్ రాణా మల్లేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జాతీయస్థాయిలో కూడా పోటీలకు అర్హత సాధించాలని కోచ్ ఆకాంక్ష వ్యక్తపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీస్తూ యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌పై పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు.






కామెంట్లు (0)