రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ రాములు
నవతెలంగాణ-మిడ్జిల్
ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలందరికీ రోజుకు రూ.800 చెల్లించాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ రాములు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వాడియాల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మాట్లాడారు. ఏల్ నీవో రావడంతో వర్షాకాలంలోనే చేతికొచ్చిన పంటలు ఎండిపోయి రైతులు అప్పులు పాలు అయినారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పంటలకు ఎకరాకు రూ.30000, వాణిజ్య పంటలైన పత్తి ,కంది, మొక్కజొన్న , పంటలకు ఎకరాకు రూ. 50వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు జయప్రదం చేయడానికి మహబూబ్నగర్ జిల్లా నుండి
భారీ ఎత్తున రైతులు తరలివచ్చి రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం రైతులతో కలిసి రైతు సదస్సు గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు గడ్డల మధు, ఆనగళ్ళ జంగయ్య, రత్నమయ్య, జంగయ్య, ఆంజనేయులు, స్థానిక నాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)