నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నరేందర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోలార్ విద్యుత్ మరమ్మత్తు పనుల రీత్యా ఉదయం 7 - 9 గంII వరకు కొత్తూరు, మధ్యాహ్నం 2 - 5 గంII వరకు 11 కెవి మిడ్జిల్ గ్రామ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామనీ, రైతులు సహకరించాలని కోరారు.







కామెంట్‌లు (0)