Magazines

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

18 అక్టోబర్, 2026

CPIM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ 

నవతెలంగాణ-సత్తుపల్లి

 నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో ​సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా ​కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు బాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ​సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


మార్కెట్‌లో వంటనూనెలు, పప్పుధాన్యాలు, బియ్యం, కూరగాయల ధరలు అమాంతం పెరగడం వల్ల సామాన్యుల కుటుంబ బడ్జెట్లు పూర్తిగా తలకిందులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ​విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ​నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన ​సరుకులను అందించాలని, మార్కెట్‌లో అక్రమంగా కొనసాగుతున్న నల్లబజారు

​దందాను కఠినంగా అరికట్టాలని కోరారు.


ఒకవైపు నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతుంటే  మరోవైపు ప్రజల ఆదాయాలు మాత్రం పెరగకపోవడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ​పెరిగిన ధరల వల్ల పేద ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి, కుటుంబ ఖర్చులను ​నిర్వహించడం ఎంతో భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలపై పడుతున్న ​ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ​ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వేపులపాటి కుమారస్వామి, కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, యలగం కృష్ణ, దాట్ల రాంబాబు, తోటకూర వెంకట్రావు, కొప్పుల చిన్నస్వామి, ​బెజవాడ లక్ష్మీనారాయణ, సరోజిని, రామకృష్ణ, షేక్ యాకుబ్ పాషా, ​పుష్పావతి, ఖతీజ ​పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్