Magazines

ఎల్‌నినోపై మాట–పాటలతో అవగాహన

2 గంటల క్రితం

El Nino
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ఎల్‌నినో వాతావరణ ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో మాట–పాట కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్‌నినో ప్రభావంతో కలిగే వాతావరణ మార్పులు,అధిక ఉష్ణోగ్రతలు,వడగాలుల ప్రభావం,వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల పరిణామాలు,ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నీటి పొదుపు,పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను కళాకారులు తమ మాటలు, పాటలు, కళారూపాల ద్వారా ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గం శిరీష,గడ్డం నాగమణి,కమ్మల ప్రవీణ్ కుమార్,పులి రాధిక,కాస స్వాతి,ఆత్మకూరి మహేందర్,ఒనపాకల కుమార్,సోదరి సురేందర్, గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,వార్డు సభ్యులు,విద్యార్థులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్