Magazines

అకాడమీ హైస్కూల్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’

58 నిమిషాల క్రితం

'Safe Bachpan Campaign' at Academy High School
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం

బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు, పిల్లలకు వారి హక్కులు, రక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాచారంలోని అకాడమీ హైస్కూల్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రియాంక నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మైబెల్లి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక విద్యార్థులకు బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం–2012 (పోక్సో చట్టం) గురించి వివరించారు. బాలలపై జరిగే లైంగిక నేరాల స్వరూపం, వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, అనుచిత సంఘటనలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాలను ఉదాహరణలతో వివరిస్తూ, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అసౌకర్యానికి గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జడ్జి ప్రియాంక పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్