Magazines

శివన్నగూడ రిజర్వాయర్ పూర్తి చేసి, సాగునీరు అందించాలి

2 గంటల క్రితం

Sivannaguda reservoir
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున 

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ ను త్వరగా పూర్తిచేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నవంబర్ 15 నుండి 18 వరకు జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.


మునుగోడు ప్రాంతంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఫ్లోరిన్ రక్కసి రుపుమాపాలంటే అది శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణంతో ముడిపడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.


వర్షాభావం, నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి నష్టపరిహారం అందించడంతో పాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న అఖిల భారత రైతు మహాసభలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామనీ, రైతుల అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు సల్వుజు రామలింగచారి, దామెర లక్ష్మి, భరత్, దాసరి ఇస్తారి, నరసమ్మ, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్