- ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారులు
నవతెలంగాణ-సత్తుపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రలో (పిక్నిక్) భాగంగా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేస్తూ, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, వివిధ వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ విహారయాత్ర విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని పంచడంతో పాటు ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.







కామెంట్‌లు (0)