నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని టిఎస్ మోడల్ స్కూల్లో గురువారం పాఠశాల విరామ సమయంలో ఉపాధ్యాయులు నవంబర్ 1,2 తేదీలలో కట్టంగూర్ లో జరిగే టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభలకు సంబంధించి కరపత్రావిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పున్న కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై జరుగుతున్న జిల్లా మహాసభలను మండలంలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యన్. వెంకటయ్య,రజయుద్దీన్,పి. శ్రీనివాస్,కరుణాకర్ రెడ్డి,డోరతి,సబితా రెడ్డి,విజయ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)