Magazines

విబిజి గ్రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్‌

1 గంట క్రితం

VBG Gramji
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్ 

విబిజి గ్రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ లోకేశ్వరం మండలం అర్లి - గొడిసెర గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విబిజి రామ్ జీ కింద గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపాధి పొందాలని పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు జాబ్ కార్డులు కలిగి ఉన్న వారిని కూలి పనులకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. విబిజి గ్రామ్‌జీ కార్యక్రమం కింద విస్తృతంగా నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు.


నీటి సంరక్షణ చర్యల వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. గ్రామంలో స్వాధ్యాయి వృక్ష మందిరానికి స్థలం కేటాయింపు అంశంపై స్థానికులతో మాట్లాడారు. వృక్ష మందిరం కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లీజు, ఇతర మార్గాల ద్వారా వృక్షాలు నాటేందుకు స్థలాన్ని కేటాయించే అంశంపై అధికారులకు సూచనలు చేశారు. సంబంధిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. సదరు ప్రాంతంలో గ్రావెల్, స్టోన్ మెటీరియల్ ఉన్నదేమో తెలుసుకునేందుకు మైనింగ్ అధికారుల ద్వారా వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూర్యారావు, సర్పంచ్ జంగం ప్రసన్న, మాజీ ఎంపిటిసి దత్తు పటేల్ , ఆయా శాఖల అధికారులు, సిబ్బంది,  స్థానికులు, తదితరులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్