రూ.2 కోట్ల 8 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
నవతెలంగాణ - కడ్తాల్
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్ గ్రామంలో రూ.2 కోట్ల 8 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, ఐమాక్స్ లైట్లు, సబ్ డివిజన్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా సీసీరోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, టీ పీ సీ సీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రాయి కంటి బిక్షపతి, ఉప సర్పంచ్ ఈ రెడ్డి యాదగిరి రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో సుజాత నాయక్, పంచాయతీరాజ్ ఏఈ పరమేష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)