నవతెలంగాణ – సదాశివనగర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి ( మర్కల్ )జువాలజి అధ్యాపకురాలుగా పనిచేస్తున్న కారం వనజ కు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ప్రొఫెసర్ ఎం. మాధవి పర్యవేక్షణలో డైవర్సిటీ, డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అండ్ ఎకాలజీ ఆఫ్ బటర్ ఫ్లైస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ ఇన్ ఇండియా అనే అంశం పై పరిశోధన చేసి, పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకుగాను, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్ కృష్ణవేణి తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు.
కారం వనజకు డాక్టరేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



