Monday, June 30, 2025
E-PAPER
Homeనిజామాబాద్వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు

వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు

- Advertisement -

మెడికవర్ హాస్పిటల్ వైద్యులు,ఎం ఎస్, ఎం సి హెచ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ శ్రీ కృష్ణ ఆదిత్య

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. ప్రతి ప్రాణం కోసం పోరాడే యోధులు వారు. ఓ వైద్యుడు ఇలా అన్నారు వైద్యుడు తన చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నప్పుడు, అది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశం, వారి కృషి, త్యాగం సమాజానికి వెలకట్టలేనిది అని మెడికవర్ హాస్పిటల్, వైద్యులు శ్రీకృష్ణ ఆదిత్య అన్నారు. ఈ మేరకు నేడు వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.జూలై 1, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్స్ తరపున మన ప్రియమైన వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటాము, వైద్య రంగానికి ఆయన చేసిన కృషి అపారమైనది.వారి నిరంతర శ్రమ, కరుణతో కూడిన సంరక్షణకు మెడికవర్ హాస్పిటల్స్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మెడికవర్ లోని ప్రతి వైద్యుడు మాకు గర్వకారణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -