Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా..?

ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా..?

- Advertisement -
  • – కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే
    – అక్రమ అరెస్టులు చేయడమా..?
    నవతెలంగాణ – డిచ్ పల్లి

    కాంగ్రెస్ ప్రభుత్వం  ఎన్నికల్లో  ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆశ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శాంతియుతంగా చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న  ఆశ వర్కర్లను ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అక్రమంగా  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం ఎంతవరకు సమంజసమని ఆశ వర్కర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆశ వర్కర్లకు పారితోషికం వద్దు పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని 15 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్  మేనిఫెస్టోలో పెట్టిన కనీస వేతనం 18000 రూపాయలు ఆరోగ్య కమీషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్  బయలుదేరుతున్న ఆశలను కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు వివరించారు.

ఆశా వర్కర్ల పారితోషికాలను ప్రతి నెల ముగింపు (30వ తేదీ) లోపు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆశా వర్కర్లకు పారితోషికాలు గతంలో చెల్లించినట్లు సకాలంలో రావడం లేదన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని, ప్రమోషన్స్ కల్పిస్తామని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చారు. ఇతర సమస్యల పైన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొన్నారు.కెసిఆర్ పదేళ్ల పరిపాలన నిర్బంధాలతోనే సాగిందని అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల పక్షపాతిగా ఉంటమంటునే ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 

 ఆశ ల శ్రమకు వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.అశా కార్యకర్తల డిమాండ్ లను నేరవేర్చాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమం తివ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గంగా లక్ష్మి వి లక్ష్మి భాగ్యలక్ష్మి,  సి లత, పాశం జ్యోతి, బండ ప్రమీల, పుష్ప, పద్మ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad