Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ మహాలింగేశ్వర ఆలయానికి విరాళం

శ్రీ మహాలింగేశ్వర ఆలయానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్  
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గ్రామానికి చెందిన అలుమల్ల పుష్ప లత మల్లారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.100116/- ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలను మంగళవారం మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సహకరించిన కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని  కోరుకుంటూ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలోనే మార్లింగేశ్వర ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలుమల్ల ప్రభాకర్ రెడ్డి , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -