తులసి హాస్పిటల్ ఎండి. డాక్టర్ సంతోష్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
విద్యార్థులు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏకాగ్రతతో మంచి చదువులు చదవడం, ఉపాధ్యాయుల బోధనలు వినడం జరుగుతుందని పట్టణంలోని తులసి హాస్పిటల్ ఎండి, ఫిజీషియన్ డాక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఉన్న ఎంవి ఆర్ స్కూల్లో శ్రీ రేవతి రామకృష్ణ మెమోరియల్ వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తులసి హాస్పిటల్ డాక్టర్లు సంతోష్ రెడ్డి డాక్టర్ సంస్కృతిలు విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు చికిత్సలు జరిపి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ .. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఉన్నత చదువులు చదవగలుగుతారని నేటి బాలలే రేపటి పౌరులనీ వీరిపైనే దేశ భవిష్యత్తు ముందు ఉంటుందని అన్నారు.
నేడు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఆయన మార్గంలో పయనించాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా విద్యార్థులు తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలు వింటూ వృధ్ధి లోకి రావాలన్నారు. సెల్ ఫోన్లు వాడవద్దని. బయట పదార్థాలు తినవద్దని విద్యార్థులను కోరారు. ఉప్పు పంచదార మైదాపిండి అసలు వాడవద్దని వాటి వలన అనారోగ్య సమస్యలు తీవ్రమైతాయన్నారు, బ్యాలెన్స్ డైట్ పాటించాలని పండ్లు కూరగాయలు ఎక్కువ తినాలని , స్వీట్లు అసలే తినవద్దని సూచించారు . రోజు గంట సేపు వ్యాయామం చేయాలని రోజుకు నాలుగు లీటర్ల మంచినీరు తాగాలని పేర్కొన్నారు. ఏ సీజన్లో వచ్చే పండ్లనుఆ సీజన్లో తినాలని తెలిపారు.
డైట్ లిమిట్ వలన మెదడుకు ఏకాగ్రత కలుగుతుందని దీనివలన చదువులో అభివృద్ధి చెంది ఈ దేశానికి మంచి సైంటిస్టులుగా డాక్టర్లుగా ఇంకా అనేక ఉన్నత ఉద్యోగాలు పొంది ఈ దేశాన్ని ముందుకు నడిపించగలుగుతారన్నారు. భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా విద్యార్థులందరూ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ కోరారు. ఈ సమావేశంలో రేవతి రామకృష్ణ మెమోరియల్ వాలంటరీ అసోసియేషన్ చైర్మన్ శేషగిరిరావు , ఎం వి ఆర్ స్కూల్స్ చైర్మన్ కొలనుపాక రవికుమార్, కరస్పాండెంట్ గీత ,పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణ్ ,పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యాభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES