Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆయుధాలు స్వాధీనం చేసుకున్న అధికారులు


ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిలా ్లయి. కాంకేర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాంకేర్‌, గరియాబంద్‌ జిల్లాల సరిహద్దులోని రావాస్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలకు అందింది. దీంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు ఆ ప్రాంతానికి తరలాయి. అనంతరం భద్రతా బలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఇరువైపుల నుంచి ఎదురుకా ల్పులు కొనసాగినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మావోయిస్టులకు సంబంధిం చిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉన్నది. మతుల్లో మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.

ఘటనా ప్రాంతం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మృతి చెందినవారితో కలుపుకొని.. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 252 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారులు తెలిపారు. దేశంలో మావోయిస్టులను అంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కారు పని చేస్తున్నది. వచ్చే ఏడాది మార్చినాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలన్నదే తమ టార్గెట్‌ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా మావోయిస్టుల ఏరివేతను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లు జరుపుతున్నాయి. ఇందులో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నా.. కేంద్రం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నది. మోడీ సర్కారు తీరుపై ఇప్పటికే పలువురు మేధావులు, సామాజికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -