Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంధన ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి : ఆప్‌

ఇంధన ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి : ఆప్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంధన ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించి వెంటనే లీటర్‌కు రూ.10 ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆప్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుర్ర రాము గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్లకు అనుకూలంగా కృత్రిమ కొరతను సృష్టించి ధరల పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకపోతే చలో సెక్రెటరియట్‌, బీజేపీ కార్యాలయాల ముట్టడి చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు దర్శనం రమేష్‌, కొడంగల్‌ శ్రీనివాస్‌, ఏ రాకేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -