చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లో ఒకటి.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
దీపావళి సందర్భంగా చిరంజీవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. చిరంజీవి అద్భుతమైన యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. లైట్ గ్రీన్ హూడ్ జాకెట్, వైట్ టీషర్ట్, మ్యాచింగ్ ట్రౌజర్స్‌లో స్టైలిష్‌గా అదరగొట్టారు.
మెగాస్టార్ తన సిగేచర్ స్మైల్‌తో బ్లాక్ మౌంటెన్ బైసికిల్‌పై సవారీ చేస్తూ కనిపించడం ఆకట్టుకుంది. స్టైలిష్ గ్లాసెస్, ట్రిమ్ చేసిన గడ్డం ఆయన లుక్‌కు మరింత యూత్‌ఫుల్ ఫీల్ ఇచ్చాయి. పోస్టర్ మొత్తం ఎనర్జీ, ఫెస్టివ్ వైబ్స్‌తో నిండిపోయింది. చిరంజీవి పక్కనే ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా తమ సైకిళ్లపై రైడ్ చేస్తూ కనిపించటం పోస్టర్‌కి మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీ టచ్‌ను జోడించింది.
ఫస్ట్ సింగిల్ ”మీసాల పిల్ల” ఇప్పటికే సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. రికార్డ్ వ్యూస్ సాధించిన ఈ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. చిరంజీవి గ్రేస్, స్వాగ్‌ను అద్భుతంగా చూపించిన ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, డీవోపీ – సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటర్ – తమ్మిరాజు, రచయితలు – ఎస్ కష్ణ, జి ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కష్ణ, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా, లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి, ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్.
అంచనాలు పెరుగుతున్నారు
- Advertisement -
- Advertisement -