అంచనాలు పెరుగుతున్నారు

వైజయంతీ మూవీస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ నుంచి దీపికా పదుకొనె అఫీషియల్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌లోని ఐకానిక్‌ హెచ్‌ హాల్‌లో గ్రాండ్‌ లాంచ్‌ అవుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ లో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి హేమాహేమీలు నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి రిలీజైన దీపికా పదుకొనె ఫస్ట్‌ లుక్‌ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు సినిమాపై అంచనాలనూ పెంచింది. ఈ ఫస్ట్‌ లుక్‌ సినిమా కథనంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యూవర్స్‌లో కలిగించడం విశేషం. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Spread the love