Wednesday, March 25, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుద్ఘాతంతో రైతు మృతి

విద్యుద్ఘాతంతో రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ-నేరేడుచర్ల
బోరు మోటార్‌ వైర్‌ తగిలి విద్యుద్ఘాతంతో రైతు ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దిర్శించర్ల గ్రామానికి చెందిన రైతు చెన్నబోయిన గోపయ్య(37) మంగళవారం ఉదయం గ్రామ శివారులో తన బావమరిది మోదాల సాయికి చెందిన పొలానికి వెళ్లాడు. వరి పైరును కోత కోయించేందుకు బోరు మోటార్‌కు ఉన్న కరెంటు వైర్‌ను పక్కకు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై గోపయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రైతుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -