నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని చేదుగట్టు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కషార్ మిషన్ వెంటనే మూసివేయాలని మండలంలోని బైరంపల్లి, చేదుగట్టు తాండ రైతులు , గ్రామస్తులు క్రషర్ మిషన్ ఏదట ధర్నా చేపట్టారు. క్రషర్ మిషన్ వల్ల దుమ్ము ధూళి ఎక్కువై వేసిన పంటలు దిగుబడి రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక లోడుతో టిప్పర్లను గ్రామాలగుంట వెళ్లడంతో రహదారులన్నీ పాడవుతున్నాయని తెలిపారు. రాత్రి సమయంలో గుట్టపై బ్లాస్టింగ్ చేయడంతో ఇండ్లు నేరాలు వచ్చి కూలిపోయే ప్రమాదం ఉందని, రాత్రిపూట నిద్ర కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన తండాలో మహిళలు పురుషులు ఎప్పుడు వచ్చి రాళ్లు ఇండ్లపై పడతాయో అని ఆందోళన గురవుతున్నామని తెలిపారు. పొలాలలో వేసిన పంటలు దుమ్ము దులితో నిండిపోయి పంట కూడా చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి క్రషర్ మిషన్ ను అనుమతులు రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.



