Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా హోలీ సంబరాలు

ఘనంగా హోలీ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – చండూరు  
మండలంలోని అన్ని గ్రామాలలో, మున్సిపల్ పట్టణంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ పట్టణ ప్రజలు  సోమవారం రాత్రి కామ దహనం చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ వేడుకలను పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, సంబరాలు చేసుకున్నారు. ఏ గలిలో చూసిన హోలీ పండుగ సంబరాలు కనపడ్డాయి.హోలీ పండుగ రోజు కామ దహనం చేసి నిప్పును ఇంటికి తీసుకురావడం ఆ నిప్పులో శనగలు, కొబ్బరి కుడుకను కాల్చుకొని తినడం ఆనవాయితీగా వస్తుంది.

ఆనందోత్సవాల మధ్య హోలీ రంగులు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, ఎస్సై శివకుమార్, కౌన్సిలర్లు  కోడి సుష్మా వెంకన్న, బుష్పాక  వాసు, పార్టీల నాయకులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -