– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ నుంచి పిలుపునిచ్చారు. ఈవిషయంలో రైతులను చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు బాలూ నాయక్, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందనీ, ఆ దిశగా రైతులు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు, డిజిటల్ మీటర్లు కొనుగోలు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. రెండేండ్లలో రూ.500 కోట్లతో 5 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను ప్రభుత్వం మంజూరు చేసిందనీ, ఇంకా అవసరమున్నచోట గోడౌన్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పంట మార్పిడిపై రైతులు దృష్టిపెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



