Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

- Advertisement -

– వెనుక నుంచి బైక్‌ను ఢకొీట్టిన లారీ
– చేవెళ్ల పీఎస్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-చేవెళ్ల

వెనకనుంచి బైకును లారీ ఢకొీన్న ఘటనలో తండ్రీ కూతురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం బిరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్‌ (32) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని కూతురు తాండ్ర కృప(13) మొయినాబాద్‌ మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. రవీందర్‌ తన కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు సోమవారం పాఠశాలకు వచ్చాడు. కూతురిని తీసుకుని బిరెల్లి గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. చేవెళ్ల మున్సిపల్‌ కేంద్రంలో హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తున్న సిమెంటు లారీ బైక్‌ను వెనుక నుంచి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad