విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి

– స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో స్టాలిన్‌
చెన్నయ్ : విద్యను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుండి తొలగించి, రాష్ట్ర జాబితాలో చేర్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యను రాష్ట్ర జాబితాలో చేరిస్తే పాఠ్య పుస్తకాలలోని విషయాలు ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. నీట్‌ వంటి జాతీయ పరీక్షలను రద్దు చేయాలని స్టాలిన్‌ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. విద్యను రాష్ట్ర జాబితాలో చేరిస్తే జాతీయ పరీక్షలను రద్దు చేయవచ్చు. కాగా స్టాలిన్‌ తన ప్రసంగంలో రచయిత సుబ్రమణ్య భారతి వంటి రాష్ట్ర ప్రముఖులకు నివాళులు అర్పించారు. డీఎంకేకు చెందిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి కష్ట సమయాలలో కేంద్రానికి తిరుగులేని మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావించారు.

Spread the love