Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత..

నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన మేర శంకర్ అనే వ్యక్తి కుటుంబానికి మీ కసం మేము సేవా సంస్థ ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. శంకర్ నిరుపేద కుటుంబానికి చెంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారని, సోమవారం ఉదయం అకస్మికంగా మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న సేవా సంస్థ వారు వారింటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నవారు వెంటనే ఎనిమిది వేల రూపాయలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రఘుపతి లక్ష్మణ్, మహేష్, సతీష్, మహేష్, రాహుల్ ,గంగాధర్, సుమన్, మాజీ ఎంపీపీ నాగమణి, సమస్త వ్యవస్థాపకులు రఘుపతి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img