Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి చెందిన కట్కూరి నరసమ్మ కుటుంబానికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం కుమ్మరి సంఘం ఆలేరు మండల అధ్యక్షుడు గంగాధరి సుధీర్ కుమార్ చొరవతో మండలంలోని కుమ్మరి సంఘం సభ్యులు,దాతల నుంచి తోచినంత విరాళాలను సేకరించి నరసమ్మ కుటుంబానికి రూ.5,000 నగదుతో పాటు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో తమ సంఘ సభ్యుల కుటుంబాలకు అండగా నిలవడం కుమ్మరి సంఘం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా విభాగం గంగాధరి శ్రవణ్,మండల ప్రధాన కార్యదర్శి జీవిలకపల్లి సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు శనిగరం హరీష్,గంగాధరి సత్తయ్య, సాయిగూడెం గ్రామ అధ్యక్షుడు గంగాధరి పరమేష్,గొలనుకొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి బాలస్వామి, కట్కూరి బిక్షపతి, రామస్వామి, యాదగిరి,రాములు,ఎల్లయ్య,నరసయ్య, ఇస్తారి, చిన్న ఎల్లయ్య, స్వామి,బాలరాజు, చిన్న బాలరాజు,ఆంజనేయులు,విష్ణు, నాగరాజు,శివ,తీగుళ్ల బాలయ్యతో పాటు గ్రామ శాఖ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -