- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని గంగ్ శెట్టి హనుమాన్ మందిరం వద్ద గల సాయి బాబా ఆలయంలో గురువారం చౌడేకర్ సంతోష్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ముందుగా ఆలయంలో ఉదయం పంచామృత అభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం హరతీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు సరిహద్దు లో గల మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పాల్గొన్నారు.
- Advertisement -