ఆర్టిక సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం
నవతెలంగాణ-వనపర్తి
విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఉపకార వేతనాల కోసం అంబేడ్కర్ ఒవర్సిస్ విద్యా నిధి పథకం క్రింద ఆర్టిక సహాయం కోసం దరఖాస్తూ చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జె. రాంజీ రావ్ మంగళవారము ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఒవర్సిస్ విద్యా నిధి ద్వారా ఉన్నత చదువులకు అందించే ఆర్థిక సాయానికి ప్రభుత్వం విద్యార్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు తేది 01-07-2026 నుండి తేది 31-08-2026 వరకు అవకాశం కల్పించనైనది.
కావున అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు సౌత్ కొరియా మొదలగు దేశాలలో ఉన్నత చదువులకు వెళ్ల దలచిన వనపర్తి జిల్లాలోని ఎస్. సి. విద్యార్థులు అంబేడ్కర్ ఒవర్సిస్ విద్యా నిధి పథకం కొరకు http://telanganaepasscbbgov.in ద్వారా 31 ఆగస్ట్ 2026 లోగా దరఖాస్తులు చేసుకోవాలని మరియు గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులు ఉండవలెనని, విద్యార్థికి 35 సం. లు మించరాదని, మరియు GRE/GMAT, TOEFL, IELTS, PTE పాస్ అయిన ఎస్.సి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి 7288082974 నంబరుకు సంప్రదించాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.



