- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన కేశారపు సమ్మయ్య, ఆకుల పెద్ద పోచాలు, కోట మణి, మల్లారం గ్రామానికి చెందిన కోరుగంటి ప్రశాంత్ ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ శనివారం మృతుల కుటుంబాలను పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం వారి చిత్రపతాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,పిఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చెప్యాల రామారావు,రావుల మొగిలి తోపాటు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -