- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో సోమవారం విట్టల్ గౌడ్ కుమారుడి పెళ్లికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేకు పెండ్లి కుమారుడి అన్న శాలువాతో సత్కరించారు. మా తమ్ముని పెండ్లికి హాజరైనందుకు మాజీ ఎమ్మెల్యే షిండేకు కుమారుడి అన్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షిండేతో పాటు మద్నూర్, జుక్కల్, నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



