Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఅనుష్క కెరీర్‌లో మరో ఐకానిక్‌ మూవీ 'ఘాటి'

అనుష్క కెరీర్‌లో మరో ఐకానిక్‌ మూవీ ‘ఘాటి’

- Advertisement -

”ఘాటి’ కథ పూర్తిగా ఫిక్షనల్‌. గంజాయి అనేది ఒక సోషల్‌ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తుంది. సర్వైవల్‌ కోసం చేసినప్పటికీ పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్‌ థీమ్స్‌తో వస్తున్న సినిమా ఇది. మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది. కానీ గ్లోరీఫై చేసేలా ఉండదు’ అని దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి చెప్పారు.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిణిగా నటించిన యాక్షన్‌ డ్రామా
‘ఘాటి’. విక్రమ్‌ ప్రభు మేల్‌ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈనెల 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి మంగళవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
‘ఘాటి’లాంటి అడ్వెంచర్‌ స్క్రిప్టు రాయడానికి మోటివేషన్‌ ఏమిటి?

  • రచయిత డాక్టర్‌ చింతకింద శ్రీనివాసరావు ‘ఘాటి’ ఆలోచన చెప్పారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్‌ ఉంది. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుం టుంది. గంజాయి బస్తాలను మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఆ ఘాటీల ప్రపంచాన్ని, కల్చర్‌ని చూపించే ఆస్కారం ఉండటంతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం.

    ఈ కథని తెరకెక్కించే క్రమంలో మీరు ఎదురొన్న ఛాలెంజ్‌ ఏమిటి?
  • ఇది చాలా కాంప్లెక్స్‌ స్టోరీ. చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రియల్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. దీని కోసం తూర్పు కనుమల్లో షూటింగ్‌ చేశాం. అలాగే ఈ కథని యాక్షన్‌తో చెబితేనే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా తీవ్రమైన పాత్రలు, తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆ ఎమోషన్‌ కనిపిస్తుంది. ఎమోషన్స్‌, పెర్ఫార్మెన్స్‌, లొకేషన్స్‌ పరంగా లార్జెస్ట్‌ కాన్వాస్‌ ఉన్న సినిమా ఇది.

    సినిమాలోని ఇతర ప్రధాన ఆకర్షణలు ఏమిటి?
  • దేశిరాజుగా విక్రమ్‌ ప్రభు, కుందుల నాయుడు అనే విలన్‌ క్యారెక్టర్‌లో చైతన్యరావు, అలాగే కాష్టాలు నాయుడు క్యారెక్టర్‌లో రవీంద్ర విజరు అద్భుతంగా నటించారు. ఇందులో రాజసుందరం మాస్టర్‌ కూడా ఒక క్యారెక్టర్‌ చేశారు. అది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది డీవోపీగా మనోజ్‌ తూర్పు కనుమల్ని అద్భుతంగా క్యాప్చర్‌ చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాగర్‌ ఇచ్చిన మ్యూజిక్‌ని ఆడియన్స్‌ చాలా కొత్త రకమైన సౌండ్‌గా ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు.

    నాయిక ప్రధానంగా సినిమా తీయటానికి రీజన్‌?
  • ‘వేదం’ తర్వాత అనుష్కతో మరో సినిమా చేయాలని ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. ఇందులో శీలావతి క్యారెక్టర్‌ అనుష్క గ్రేస్‌, యాటిట్యూడ్‌, సూపర్‌ స్టార్‌ డమ్‌కి పర్ఫెక్ట్‌ యాప్ట్‌. ఈ సినిమా కమర్షియల్‌ యాక్షన్‌తో అనుష్క కోసం చేసిన ఒక బిగ్‌ స్కేల్‌ మూవీ. అనుష్క బలం ఏంటో మనందరికీ తెలుసు. ఆమె సినిమా బాగుంటే ఆ రేంజ్‌ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్‌ చేశాయి. అరుంధతి నుంచి భాగమతి వరకు ఎన్నో ఐకానిక్‌ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఇందులో తనకి చాలా ఎక్సైటింగ్‌ క్యారెక్టర్‌ దొరికింది.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad