నవతెలంగాణ-హైదరాబాద్
బౌల్డర్‌హిల్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నమెంట్ (పీజీటీఐ) విజేతగా శుభాంకర్ శర్మ (చండీగఢ్) నిలిచారు. 132 మంది గోల్ఫర్లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో శుభాంకర్ రికార్డు 8 షాట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 25-అండర్ 263 (66-66-64-67) స్కోరు సాధించిన శుభాంకర్.. పీజీటీఐలో అత్యల్ప అగ్రిగేట్ స్కోరు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్ సాధించిన శుభాంకర్..రూ. 15 లక్షల నగదు బహుమతిని సైతం సొంతం చేసుకున్నారు. మహ్మద్ అజహర్ (హైదరాబాద్), రషీద్ ఖాన్ (ఢిల్లీ), అంగద్ చీమా (చండీగఢ్)లు సంయుక్తంగా (271) ద్వితీయ స్థానంలో నిలిచారు. పీజీటీఐ టూర్‌లో ఐదుసార్లు విజేత అజితేశ్ సందు 272 స్కోరుతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పీజీటీఐ తర్వాతి టోర్నీ ఈ నెల 21 నుంచి హర్యానాలో జరుగనుంది.
గోల్ఫ్ విజేత శుభాంకర్
- Advertisement -
- Advertisement -



