Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలురాయల్స్‌ మేనేజర్‌కు జరిమానా

రాయల్స్‌ మేనేజర్‌కు జరిమానా

- Advertisement -

తీవ్రంగా హెచ్చరించిన ఏసీఎస్‌యూ
ముంబయి :
రాజస్తాన్‌ రాయల్స్‌ టీమ్‌ మేనేజర్‌ రోమి బిందర్‌పై బీసీసీఐ జరిమానా విధించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా రోమి బిందర్‌ డగౌట్‌లో ఫోన్‌ వాడుతూ కనిపించాడు. ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ అంశంలో విచారణ చేపట్టిన బీసీసీఐ యాంటీ కరప్షన్‌ అండ్‌ సెక్యురిటీ యూనిట్‌ (ఏసీఎస్‌యూ) రోమి బిందర్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. ‘రోమి బిందర్‌ వివరణతో బీసీసీఐ ఏసీఎస్‌యూ సంతప్తి చెందలేదు. ఇది తొలి తప్పిదం కావటంతో బిందర్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించాం. తీవ్రంగా హెచ్చరిస్తూ.. భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించామని’ బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -