Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం 

రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం 

- Advertisement -

ప్రారంభించనున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బుధవారం ప్రారంభిస్తున్నారని తొర్రూర్ తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్ లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. తొర్రూరు, పాలకుర్తి సొసైటీ, ఐకెపిల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. తొర్రూర్ సొసైటీ ఆధ్వర్యంలో తొర్రూరులో, ఐకెపి ఆధ్వర్యంలో తీగారంలో, పాలకుర్తి సొసైటీ ఆధ్వర్యంలో వల్మీడీలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ ను పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -