Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు  

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు  

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఈదురు యాకయ్య మాదిగ జెండా ఆవిష్కరించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తో కలిసి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఎస్సీలు సంఘటితం కావాలని అన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈదురు సైదులు మాదిగ, ఎంఈఎఫ్ ఎర్ర వెంకన్న మాదిగ, నాయకులు దంతాలపల్లి ఉపేందర్, చిలుక బిక్షపతి, సుంకరి అంజయ్య, యాకయ్య, మోహన్, శ్రీనివాస్, శంకర్, సంపత్, వెంకన్న, నారాయణ, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -