Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు

పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ శాఖలో పలువురు పోలీసులు జూన్ 30 న పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేసిన సిబ్బంది వివరములు.. అంగూర్ సుదర్శన్, ఏ.ఎస్.ఐ, టౌన్ – 4 పోలీస్ స్టేషన్,నిజామాబాద్ మొత్తం సర్వీసు పోలీస్ శాఖలో (36) సంవత్సరాలు పూర్తి చేసి  పదవి విరమణ చేశారు. మహమ్మద్ అబ్దుల్ వహాబ్ , ఏ.ఎస్.ఐ ఆర్మూర్ పి.ఎస్, నిజామాబాద్ పోలీస్ శాఖలో ( 36 ) సం|| ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు.బి మహమ్మద్ అబ్దుల్ హకీం, ఏ.ఆర్. ఎస్.ఐ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్  పోలీస్ శాఖలో (36) సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ  చేశారు.

 ఎం.ఏ.అజ్మత్, హెడ్ కానిస్టేబుల్ 1052, కోటగిరి, పి.ఎస్,నిజామాబాద్ పోలీస్ శాఖలో (41) సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి lపదవీ విరమణ చేశారు. తాకుర్ ఆషా కుమారి ,సీనియర్ అసిస్టెంట్ , పోలీస్ కార్యాలయం నిజామాబాద్ మొత్తం సర్వీస్ 38 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ చేశారు.  మంగళవారం వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో)  ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని , మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘన నీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయ పడుతామని , మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురా రోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు భాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లుసందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్)  ఎన్.శుభం ప్రకాష్ , ఎ.ఒ.మేడం అసియా బేగం , ఎ.అర్ ఏ.సి.పి  బి. శ్రీరాములు , ఆఫీస్ సూపర్డెంట్లు  శంకర్ ,  ఎ. జగతి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీధర్ రెడ్డి , సీ.ఐ శ్రీనివాస్ , రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్)  ధరణి కుమార్, (ఎం.టీ.ఓ) ఎస్.శేఖర్ బాబు , (వెల్ఫేర్ / హోంగార్డ్స్ )  సతీష్ , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు  షాకిల్ పాషా పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -