Thursday, August 13, 2026
E-PAPER
Homeజిల్లాలుమాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కు ఘన స్వాగతం

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కు ఘన స్వాగతం

- Advertisement -

అమెరికా పర్యటన ముగించుకొని నేడు మంథనికి చేరుకున్న పుట్ట మధుకర్
నవతెలంగాణ – మలహర్ రావు
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని మంథని నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం ఘన స్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికి, అనంతరం ర్యాలీగా బయలుదేరారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ చౌరస్తా వద్దకు చేరుకున్న ర్యాలీ అక్కడి నుంచి రాజగృహ వరకు కొనసాగింది. అడుగడుగునా అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. రాజగృహకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్-శైలజ  దంపతులను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అమెరికా పర్యటన అనంతరం స్వస్థలానికి తిరిగి వచ్చిన తమ ప్రియతమ నాయకుడికి లభించిన ఈ ఘన స్వాగతంతో మంథని నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -