టీ జీ ఎస్ఆర్ టి సి టైర్డ్ ఏ డీ సీ పత్తిపాక తిరుపతి చారి
నవతెలంగాణ-నెల్లికుదురు
2013, 2017, 2021 వీఆర్సీలు మాకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించి మా సమస్యలను పరిష్కరించాలని టి జి ఎస్ ఆర్ టి సి రిటైర్డ్ ఎడిసి తిరుపతా చారి గురువారం ఆర్టిసి ఎండి కి పోస్టులో కార్డు అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాంట్విటీ ఏరీస్ సంబంధించిన డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మా జీవితాలు వృద్ధాప్యంలో ఉండి ఆర్థికంగా లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల పెండింగ్ బకాయిలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే మాకు మా సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని, కనీసం టెన్షన్ కూడా లేకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం నుండి పెన్షన్ రాక ఆర్థికంగా లేక అనారోగ్యం పాలు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలను వదులుకోవలసిన సందర్భాలు వస్తున్నాయని గుర్తు చేశారు. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.



