సెన్సెక్స్ 460 పాయింట్ల పతనం
ముంబయి : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబులను 5 శాతం, 18 శాతాలకు పరిమితం చేసినప్పటికీ దలాల్ స్ట్రీట్‌లో ఎలాంటి ఉత్సాహం కానరాలేదు. కొత్త శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి కనబర్చలేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతల భయాలు, హెచ్1బీ వీసా ఫీజును అమెరికా అమాంతం పెంచడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 460 పాయింట్లు లేదా 0.56 శాతం పతనమై 82,160కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 25,202 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎటెర్నల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.67 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.17 శాతం చొప్పున తగ్గాయి.
మార్కెట్లను అలరించని జీఎస్టీ తగ్గింపు
- Advertisement -
- Advertisement -