Thursday, February 12, 2026
E-PAPER
Homeమానవిచియా సీడ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు…

చియా సీడ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు…

- Advertisement -

నలుపు, తెలుపు రంగుల్లో మార్కెట్లో లభించే చియా సీడ్స్‌ వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు చియా సీడ్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడించాయి.

-చియా సీడ్స్‌ని నేరుగా తీసుకోకూడదు. వాటిని నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని పెరుగులోనూ, సలాడ్స్‌లోనూ వేసుకుని తీసుకోవచ్చు.
-నానబెట్టిన వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా పంచదార, గ్యాస్‌ వాటర్‌ని పోసుకుని తీసుకోవచ్చు.
-చియా సీడ్స్‌ వల్ల బరువు మాత్రమే కాదు, వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.
-చియా సీడ్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి జీర్ణక్రియకు ఎంతో దోహదపడతాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -