30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలులు
బుధవారం 229 ప్రాంతాల్లో కురిసిన వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి, శాస్ర్తవేత్త ఎ.శ్రావణి తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లారీ వర్షాలు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. గురువారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో, శుక్ర, శనివారాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, యాద్రాద్రి భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయని తెలిపారు. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 229 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వాన పడింది.
వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



