- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన కాళీ మంతన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఎయిర్‌బస్ హెచ్130 హెలికాప్టర్ గురువారం ఉదయం బయలుదేరిన ఐదు నిమిషాలకే సంబంధాలు కోల్పోయింది. దీంతో అధికారులు గాలింపు మొదలుపెట్టారు. కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు రెస్య్కూ సిబ్బంది గుర్తించారు. మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు.
- Advertisement -



