- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్
చిన్ననాటి మిత్రులు, గ్రామస్తులు మృతుని కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేస్తూ ఆదర్శంగా నిలిచారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయి మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి గ్రామ యువకులు అండగా నిలిచారు.
ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి అంకోల్ గ్రామానికి చెందిన యువకులు ఆర్థిక సాయం చేశారు. గురువారం ఆ కుటుంబాన్ని పరామర్శించిన యువకులు.. రూ.63,500 కుటుంబసభ్యులకు అందించారు. ప్రాణాలు కోల్పోయిన సాయిది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక సాయం చేసినట్లు యువకులు తెలిపారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచిన యువకులకు, ప్రజలకు గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -



