నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం అధ్యక్షతన భువనగిరి పట్టణ నూతన మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉత్కూరి అశోక్ గౌడ్ నూతన కౌన్సిలర్లు ఐనా 5 వ వార్డ్ తుమ్మల యాస్మిన్ నగేష్ ,16 వ వార్డ్ భోజన శారద, 19 వ వార్డ్ బండారు స్వర్ణలత, 21 వ వార్డ్ వంగేటి సుచరిత భాస్కర్ లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ భువనగిరి పురపాలక మున్సిపల్ ఎన్నికలలో బిజెపి పార్టీ తరపున అందరూ మహిళలే ఎన్నికవ్వడం చాలా సంతోషకరమైన విషయమని పట్టణంలోని వార్డు సమస్యలపై తమ వాని వినిపిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ , సురవి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోళ్ల బిక్షపతి, ఆకుతోట రామకృష్ణ, మంగు నరసింహారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, కొలిచేలిమ మల్లికార్జున్, ఎదగాని సంతోష్, సాయి కిరణ్, ప్రవీణ్, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.


