Wednesday, March 4, 2026
E-PAPER
Homeక్రైమ్భారీగా కల్తీ నెయ్యి పట్టివేత..

భారీగా కల్తీ నెయ్యి పట్టివేత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యిని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి బంజారాహిల్స్ రోడ్‌ నం 12లో గోల్కొండ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రైడ్‌ డెయిరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి.. రూ.18 లక్షల విలువ చేసే 530 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద్ జునైద్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -