Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెట్లను పెంచితే మానవ మనుగడ కొనసాగుతుంది..

చెట్లను పెంచితే మానవ మనుగడ కొనసాగుతుంది..

- Advertisement -

– మహ్మదాబాద్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
నవతెలంగాణ – జుక్కల్ 
చెట్లను పెంచడం వలన మానవ మనుగడ ఆహ్లాదకరంగా ఉంటుందని మహమ్మదాబాద్ ప్రభుత్వ ఎంపీయూపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు కాంబ్లే గోపాల్ అన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చసిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుడు సుంకరి శ్రీనివాస్ , జీపి కార్యదర్శి, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు . పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో గ్రామస్తులందరూ కలిసి ఉపాధ్యాయులతో మనమహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అన్నారు.

మొక్కలు చెట్లుగా పెరిగి భారీ వృక్షాలుగా మారుతాయని వాటి వలన మానవ మనుగడకు కావలసిన ఆక్సిజన్ ఇస్తుందని ఇది మానవాళికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి బోనాల పండుగను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు . ఉపాధ్యాయుడు సుంకరి శ్రీనివాస్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు అందరూ కలిసి స్వంత ఖర్చులతో విద్యార్థులందరికీ జామెంట్రీ బాక్స్ లను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము,  జిపి కార్యదర్శి జీవన్ , హెచ్ఎం కే.గోపాల్ , ఉపాధ్యాయులు సాయిలు ,  జ్ఞానేశ్వర్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -